• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

పాక్-కివీస్ పోరుకు వర్షం అంతరాయం

పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. రాత్రి 7 గంటలకు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కాగా, వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు. దాదాపు ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, రెండు జట్లు చెరో పాయింట్‌ను పంచుకుంటాయి.

February 21, 2026 / 08:03 PM IST

శిఖర్ ధావన్ పెళ్లి.. ఫొటోలు వైరల్

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు సహచర క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ధావన్‌కు తన మొదటి భార్యతో ఒక కుమారుడు ఉన్నాడు. ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది.

February 21, 2026 / 07:53 PM IST

న్యూజిలాండ్ vs పాకిస్తాన్: ప్లేయింగ్-11 ఇదే

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదిపై వేటు వేసింది. అతడి స్థానంలో ఫఖర్ జమాన్‌ను తీసుకుంది.NZ: సీఫెర్ట్(w), అలెన్, రవీంద్ర, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, సాంట్నర్(c), నీషమ్, హెన్రీ, సోధి, ఫెర్గూసన్PAK: ఫర్హాన్, అయూబ్, అఘా(c), బాబర్, ఫఖర్ జమాన్, ఉస్మాన్(w), షాదాబ్, నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్

February 21, 2026 / 06:38 PM IST

BREAKING: కివీస్‌పై టాస్ గెలిచిన పాక్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ రేసులో తొలి అడుగు వేయాలని చూస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది.

February 21, 2026 / 06:34 PM IST

BREAKING: చరిత్ర సృష్టించిన టీమిండియా

ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా జట్టు సంచలనం సృష్టించింది. పటిష్టమైన ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో హర్మన్‌ప్రీత్ సేన కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్ 176 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది. కాగా, ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా జట్టు టీ20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.

February 21, 2026 / 05:07 PM IST

తగ్గేదే లే.. నా స్టైల్ ఇంతే: అభిషేక్ శర్మ

టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండటంతో తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు అభిషేక్ స్పందించాడు. తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పు ఉండబోదని అతను స్పష్టం చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా తాను ఇదే దూకుడుతో ఆడుతున్నానని, భవిష్యత్తులో కూడా అదే ఆటతీరును కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

February 21, 2026 / 04:49 PM IST

ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం..?

క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరు వ్యూవర్‌షిప్ రికార్డులను తిరగరాసింది. అయితే, ఈ దాయాది జట్లు మరో కీలక టోర్నీలో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా గేమ్స్‌లో క్రికెట్ కూడా ఉండటంతో, అక్కడ IND-PAK పోరు జరిగే అవకాశం ఉంది.

February 21, 2026 / 04:34 PM IST

అభిషేక్ ఫామ్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

అభిషేక్ శర్మ ఫామ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.’అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన చెందుతున్న వారిని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. నిజానికి మీరు అతని గురించి కాదు, రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోబోయే ప్రత్యర్థి జట్ల గురించి ఆందోళన చెందాలి’ అని సూర్య తెలిపాడు. గతేడాది అభిషేక్ జట్టు కోసం చాలా చేశాడని, ఇప్పుడు అతనికి అండగా నిలివాల్సిన బాధ్యత తమపై ఉందన్నాడు.

February 21, 2026 / 04:03 PM IST

IND vs AUS: భారత్ స్కోర్ ఎంతంటే..?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 176/6 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(82), జెమీమా రోడ్రిగ్స్(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 2 వికెట్లు పడగొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

February 21, 2026 / 03:29 PM IST

కివీస్ vs పాక్ మ్యాచ్‌కు వర్షం గండం..?

సూపర్-8లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ‘ఆక్యూవెదర్’ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఈరోజు రాత్రి 80 నుండి 100 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే, ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే రెండు జట్ల సెమీస్ అవకాశాలు దెబ్బతింటాయి.

February 21, 2026 / 03:23 PM IST

IND vs SA: తుది జట్టులో కీలక మార్పులు..!

అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించేలా ఉండటంతో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లతో భారత్ బరిలోకి దిగనుంది. అలాగే, ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించే వీలుంది.

February 21, 2026 / 03:04 PM IST

భారత్-పాక్ మ్యాచ్.. కళ్లు చెదిరే రికార్డు

T20 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కళ్లు చెదిరే రికార్డును నెలకొల్పింది. జియోస్టార్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కేవలం ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లోనే ఏకంగా 163 మిలియన్ల (16.3 కోట్లు) వ్యూస్ నమోదయ్యాయి. ఇది 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కంటే కూడా అత్యధికం. దీంతో ఈ మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.

February 21, 2026 / 02:48 PM IST

టీమిండియా ఫాస్ట్ బౌలర్‌కు గాయం

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పాండ్యా కొట్టిన బంతి.. సిరాజ్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో అతడికి చికిత్సను అందించాడు. అనంతరం సిరాజ్ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే, సిరాజ్ గాయం తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

February 21, 2026 / 02:33 PM IST

టీమిండియాపైనే ఒత్తిడి: సౌతాఫ్రికా కోచ్

సూపర్‌-8 పోరులో రేపు భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ కాన్రాడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత్ జట్టుపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఈ ఒత్తిడితోనే భారత్ ఓడిపోయే అవకాశం ఉందన్నాడు. కాగా, రెండు జట్లు బలంగా ఉండటంలో రేపటి మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

February 21, 2026 / 02:18 PM IST

తొలి ప్లేయర్‌గా ఎలీస్ పెర్రీ రికార్డ్!

ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 350* అంతర్జాతీయ మ్యాచులాడిన తొలి ఆసీస్ ప్లేయర్‌గా అవతరించింది. మొత్తంగా హర్మన్(357*), సూజీ బేట్స్(355) తర్వాత 3వ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. కాగా ఆసీస్ తరఫున 15 టెస్టులు, 165 వన్డేలు, 170 T20లు ఆడిన పెర్రీ మొత్తం 7,634 రన్స్, 331 వికెట్లు తీసింది. ఇందులో 5 సెంచరీలు, 41 అర్ధ సెంచరీలూ ఉన్నాయి.

February 21, 2026 / 02:17 PM IST