Team India Captain Rohit Sharma Interesting Comments On Players
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో…త్రో డౌన్ నుంచి బంతిని అందుకునే క్రమంలో రోహిత్ శర్మ మణికట్టుకు బాల్ వేగంగా తాకింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడుతూ రోహిత్ ఇబ్బంది పడ్డాడు. వెంటనే ప్రాక్టీస్‌ను ఆపేసి మధ్యలోనే వెళ్లిపోయి పక్కకు కూర్చున్నాడు. రోహిత్ కి ప్రాథమిక చికిత్స అందించిన కూడా ఫలితం లేకపోయింది. నొప్పితోనే బాధపడుతూ కూర్చున్నాడు .
గాయం తీవ్రత తెలియనప్పటికీ.. కీలకమైన ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ముందు రోహిత్ శర్మ గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శర్మ గాయం తీవ్రమైతే.. కచ్చితంగా టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ సక్సెస్ అయినా.. బ్యాట్స్‌మెన్‌గా విఫలమయ్యాడు.
ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్థాన్‌తో 4, నెదర్లాండ్స్‌తో 53, సౌతాఫ్రికాతో 15 పరుగులు, బంగ్లాదేశ్‌తో 2 రన్స్, జింబాబ్వేతో 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కానీ అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడని.. బ్యాట్‌తో కూడా రాణించాలని అతని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి బీసీసీఐ నిర్ణయం మేరకు సెమిస్ లో ఎవరు కెప్టెన్సీ వహిస్తారో చూడాలి. ఇక నేడు జరిగే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ తో పాకిస్థాన్ జట్టు తలపడనుంది.