»India Pakistan Cricket Match Will Be Held In New York City Usa
INDvsPAK: అమెరికాలో ఇండియా వర్సెస్ పాక్ టీ20
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం రెండు దేశాలకే కాదు యావత్తు ప్రపంచానికే కన్నుల విందుగా ఉంటుంది. అలాంటిది వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లు తలపడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. అయితే ఈ ఇరు జట్లు తలపడేది ఎక్కడో తెలుసా.. అది అమెరికా న్యూ యార్క్ సిటీలో. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.
India Pakistan cricket match will be held in New York City, USA
INDvsPAK: క్రికెట్ మ్యాచ్ అంటే అందరికి ఇష్టమే. అందులో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తలపడుతున్నాయి అంటే రెండు దేశాలతో పాటు ఇతర దేశాలకి చెందిన ప్రేక్షకులలో ఎంత ఉత్కంఠ ఉంటుంది. ఇక ఈ రెండు దేశాలు పోటీపడే ప్రతి సారి ఐసీసీ టోర్నమెంట్ నిర్వాహకులకు తలపోటు కూడా వస్తుంది. టికెట్ల విషయంలో, వచ్చే ప్రేక్షకుల విషయంలో అక్కడి భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌లో కూడా చూశాము. హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలవబడే ఇండియా పాక్ మ్యాచ్ ను ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు చూడటానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. ఇక వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉంది. దీని కోసం అన్ని టీంలు ముస్తాబు అవుతున్నాయి. అదే విధంగా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుండగా, ఈ సిరీస్‌లో కూడా ఇండియా పాక్ తలపడనున్నాయి.
అమెరికాలోని న్యూయార్కులో ఈ మ్యాచ్ నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కులు వెస్టిండీస్, అమెరికాలకు దక్కగా, అసలు క్రికెట్‌కి పెద్దగా ఆదరణ లేని అమెరికాలో ఈ ఇరు జట్ల పోరు జరిగితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం స్టేడియం దొరకడం లేదని ఇక టాక్ వినిపిస్తోంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించే క్రికెట్ వసతులు ఉన్న స్టేడియం అమెరికాలో లేదని అంటున్నారు. అందులో భాగంగా భారత్, పాక్ మ్యాచ్ అంటే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వస్తారు కాబట్టి అంత మంది పట్టే స్టేడియం ఆమెరికాలో లేదు. అందుకోసం న్యూయార్క్ ను ఆనుకొని ఉండే బ్రాంక్స్ లో 34,000 మంది కూర్చుని మ్యాచ్ చూసే విధంగా ఒక కొత్త స్టేడియం నిర్మించాలని ఐసిసి ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.