బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్కు రోహిత్ శర్మ దూరమైతే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని కోచ్ గంభీర్ తెలిపాడు. అలాగే బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు. కాగా భారత్ – ఆసీస్ మధ్య తొలి మ్యాచ్ ఈనెల 22న ప్రారంభం కానుంది. అయితే రోహిత్ భార్య అదే సమయంలో రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండటంతో అతడు తొలి మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది.