పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ ఆలీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ దక్కించుకున్నాడు. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో రెండు మ్యాచ్ల్లో కలిపి 20 వికెట్లు పడగొట్టాడు. దీంతో అక్టోబర్ నెలకు ఐసీసీ ఉత్తమ ఆటగాడిగా నోమన్ అలీకి ఈ అవార్డ్ దక్కింది. ఈ అవార్డు కోసం కగిసో రబాడ, మిచెల్ శాంట్నర్ పోటీ పడినప్పటికీ నోమాన్ అలీ తన అద్భుత ప్రదర్శనతో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.