తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ ఓపెనర్ల నుంచి గొప్ప ప్రదర్శనేమీ రాలేదని ఆసీస్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. వన్‌డౌన్, సెకండ్ డౌన్ బ్యాటర్లలో నిలకడ లేదని తెలిపాడు. ఇదే తమ జట్టును ఒత్తిడికి గురి చేస్తోందని పేర్కొన్నాడు. ట్రావిస్ హెడ్ మిడిలార్డర్లో దూకుడుగా ఆడి సెంచరీతో ఆదుకున్నాడని చెప్పాడు. అయితే, హెడ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు అవసరమని.. కేవలం ఒక్క బ్యాటర్ మాత్రమే ఆడితే సరిపోదని వ్యాఖ్యానించాడు.