BGTలో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచి సిరీస్పై ఆసక్తి రేకెత్తించాయి. WTC ఫైనల్ చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కావడంతో తర్వాతి 3 మ్యాచ్లు మరింత హోరాహోరీ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో DEC 26 నుండి జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మ్యాచ్కు ఇంకా 15 రోజులు సమయం ఉన్నా.. మొదటి రోజు ఆటకు సంబంధించి టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.