పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు భారత్ రావట్లేదని పీసీబీకి ఐసీసీ మెయిల్ చేసింది. దీంతో PCB ఆ మెయిల్‌ను తమ ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసింది. ఇప్పుడేం చేయమంటారని సలహా కోరింది. ఒకవేళ ICC నుంచి అంతిమంగా తమకు ప్రతికూల నిర్ణయం వస్తే.. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కు తమ జట్టును పంపించకూడదని పాకిస్థాన్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.