సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే జోరులో ఇవాళ జరగనున్న రెండో టీ20లోనూ గెలవాలని భారత్ భావిస్తోంది. అయితే, రెండో టీ20లో తుదిజట్టులో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ స్థానంలో ఆల్‌రౌండర్ రమన్‌దీప్ సింగ్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌తో స్పిన్ బౌలింగ్ బలంగా ఉండటంతో రమన్‌దీప్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.