అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో సిరాజ్- హెడ్ల మధ్య వాగ్వాదం హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ‘హెడ్ వికెట్ తీసినప్పుడు సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. అతడు ఇచ్చిన సెండాఫ్ను చూశా. అప్పుడు నాకు సిరాజ్ గురించి ఆందోళన మొదలైంది. బ్యాటర్లకు డ్రెస్సింగ్ రూమ్‌ను చూపిస్తూ సెండాఫ్లు ఇవ్వడం రిఫరీ, అంపైర్లకు నచ్చవు’ అని పాంటింగ్ తెలిపాడు.