పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 298 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడినప్పటికీ.. చివరికి సదర్లాండ్ అద్భుత సెంచరీ(110)తో జట్టుకు భారీ స్కోర్‌ను అందించింది. గార్డ్నర్, మెక్‌గ్రాత్ ఆఫ్ సెంచరీలతో రాణించారు. భారత్ బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీయగా, దీప్తీ 1 వికెట్ తీసుకుంది.