బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుతంగా ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్కు ‘ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. దీనిని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వారికి అందించాడు. అయితే, ఒకే సిరీస్లో ఇద్దరికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. కాగా, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించగా.. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ కొనసాగిస్తున్నాడు.