బెంగళూరు టెస్టులో టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల స్వల్ప స్కోరుకు ఆలౌట్ కావడంతో డీలా పడ్డ జట్టుకు మరో షాక్ తగిలింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ మోకాలికి బంతి తాకడంతో నొప్పి భరించలేక అతడు మైదానం వీడాడు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేస్తున్నాడు. ఒకవేళ పంత్ మ్యాచ్ మొత్తానికి దూరమైతే రెండో ఇన్నింగ్స్లో జట్టు బ్యాటింగ్ బలహీనపడనుంది.