TG: హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు ఇప్పటికే కబ్జాకు గురై ముంపునకు సమస్య పెరిగిందని CM రేవంత్ అన్నారు. ఇటీవల వరదల్లో ముంబయి, బెంగళూరు, చెన్నై, విజయవాడలో ఏం జరిగిందో చూశామన్నారు. చినుకు పడితే చాలు హైదరాబాద్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది.. అలాంటి పరిస్థితి ఉండొద్దనే హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ తీసుకొచ్చామన్నారు. దీనిపై అందరూ అలోచించాలని.. లేకపోతే భవిష్యత్తులో హైదరాబాద్లో మూసీ కూడా ఉండదని హెచ్చరించారు.