TG: గత ప్రధానులు పంచవర్ష ప్రణాళికలు చేపట్టి క్రమబద్ధంగా దేశాన్ని అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తిండికి అలమటించిన భారతదేశం ఇవాళ ఆహారోత్పత్తిలో మిగులు సాధించిందన్నారు. దేశానికి సాంకేతిక, ఐటీ విప్లవం తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ అని ఉద్ఘాటించారు. ప్రపంచంలో చాలా దేశాలు ఐటీ కంపెనీలకు భారతీయులనే నియమించుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రధానులు అమలు చేసిన సంస్కరణలతో దేశం ఎంతో ముందుకెళ్లిందన్నారు.