TG: పది నెలలుగా అధికారులు నిద్రాహారాలు మాని మూసీపై పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారన్నారు. 33 బృందాలు మూసీపై అధ్యయనం చేశాయమన్నారు. దుర్భర పరిస్థితిల్లో ఉన్న వారికి మెరుగైన జీవితం అందించాలని తాము భావిస్తున్నామన్నారు. విద్యావంతుల నుంచి నిరక్షరాస్యుల వరకు అందరికీ హైదరాబాద్ ఉపాధి కల్పించాలనేదే తమ ఉద్దేశమన్నారు.