VZM: బొబ్బిలి పట్టణంలోని కొత్త ఎరుకుల వీధి, మహారాణి పేట ప్రాంతాల్లో గురువారం వార్డు సందర్శన కార్యక్రమం జరిగింది. కమిషనర్ ఎల్.రామలక్ష్మి సిబ్బందితో కలిసి వార్డుల్లో పర్యటించారు. స్థానికులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి మధ్యాహ్న భోజన పనితీరును అడిగి తెలుసుకున్నారు.