MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఏపీ, తెలంగాణలో సోమవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్(Polling) జరిగింది. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలకు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానలకు, 4 స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) నిర్వహించారు.

తెలంగాణ(Telangana)లో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఏపీ(AP)లోని ఒకటి రెండు చోట్ల మాత్రం చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. ఎమ్మెల్సీ(MLC) ఓట్లను మార్చి 16వ తేదిన లెక్కించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Elections)ల్లో సాయంత్రం 4 గంటల వరకు 60.88 శాతం పోలింగ్(Polling) నమోదవ్వగా కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Elections)ల్లో సాయంత్రం 4 గంటల వరకు 85.24 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.