TG: హైదరాబాద్ నగరానికి దక్షిణాన గోల్ఫ్ సిటీ నిర్మించేందుకు స్టోన్ క్రాఫ్ట్ సంస్థ ముందుకు వచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్సులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధత తెలిపిందన్నారు. ఈ సంస్థ ప్రస్తుతం ముంబయిలో షాపూర్జీ పల్లోంజి సంస్థతో కలిసి గోల్ఫ్ సిటీ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోనూ దాదాపు 200 ఎకరాల్లో 18 హోల్ ప్రామాణిక గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేయనుంది.