హెజ్బొల్లాకు కొత్త చీఫ్‌గా డిప్యూటీ జనరల్ నయీం ఖాసిమ్‌ను నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సంచలన పోస్ట్ పెట్టింది. కొత్త అధ్యక్షుడు ఎక్కువ కాలం ఉండడంటూ పరోక్షంగా హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఖాసిమ్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇది తాత్కాలిక నియామకం మాత్రమే.. సుధీర్ఘకాలానికి కాదు’ అని ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ పేర్కొన్నారు. ‘కౌంట్ డౌన్ మొదలైంది’ అని మరో పోస్ట్ పెట్టారు.