హమాస్ ఛీప్ మృతిపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దాడిలో హమాస్ ఛీఫ్ యాహ్యా సిన్వర్ చనిపోయినప్పటికీ హమాస్ ఉనికిలోనే ఉందని అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. సిన్వర్ మృతి బాధ కలిగిస్తోందని వెల్లడించారు. సిన్వర్ అమరుడు కావడంతోనే అంతా అయిపోయినట్లు కాదని, హమాస్ మనుగడకు ఎలాంటి ఢోకా లేదని వ్యాఖ్యానించారు.