AP: సొంత నియోజకవర్గంలో సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో సీఎం పేరు ముద్రించలేదు. కుప్పం ఎమ్మెల్యేగా, సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు పేరును అధికారులు మరిచిపోవడంతో ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు బిన్నాభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.