AP: విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈనెల 15 నుంచి 30 వరకు అమెరికా, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టు గతంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. 8వ తేదీ వరకు సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.