AP: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూపై టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. సిట్ పూర్తిగా టీడీపీ ప్రభుత్వ ఆధీనంలో ఉందని ఆరోపించారు. సిట్ స్వతంత్రంగా విచారిస్తుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు కోరుకున్నట్లుగానే సిట్ నివేదిక ఉంటుందని అన్నారు.