TG: సామాజిక న్యాయం అందించేందుకు కులగణన సర్వే చేస్తున్నామని CM రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏడాదిలోపు గురుకులాల నిర్మాణాలు పూర్తి చేస్తామని, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు గానూ వైరా, మధిర గురుకులాల విద్యార్థులు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.