సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి. అయితే బరువు తగ్గడంలో సగ్గు బియ్యం కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సమస్యలు తగ్గుతాయని, బీపీ కంట్రోల్ అవుతుందని అంటున్నారు. సగ్గు బియ్యాన్ని జావగా తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. గ్యాస్ సమస్యలు తగ్గటంతో పాటు మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.