AP: వైఎస్ షర్మిలకు వైసీపీ అధినేత జగన్ బహిరంగ లేఖ రాశారు. ‘ఇటీవల నువ్వు నాపై చేపట్టిన చర్యలు నా మనుసును తీవ్రంగా గాయపరిచాయి. నువ్వు చేసిన అసత్య ఆరోపణలు నాకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వు ఎంచుకున్న మార్గాన్ని నీ వివేచన, నీ విచక్షణకే వదిలేయాలనుకుంటున్నా. నీ తీరు నా పట్ల సానుకూలంగా ఉండి, కోర్టు కేసులన్నీ పరిష్కారమైతే నీకు ఏమి చేయాలి, ఎంత చేయాలి అనే విషయం పరిశీలిస్తా’ అని లేఖలో పేర్కొన్నారు.