తిరుమల వెంకటేశ్వర స్వామిని ఇవాళ తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్రాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తమ మనువడి పుట్టు వెంట్రుకలు శ్రీవారికి సమర్పించామన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై స్వామివారి కృప ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.