AP: మాజీ సీఎం జగన్ నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఈ ఐదేళ్లు ఒక సవాల్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచుతూ, దుబారా ఖర్చులు అరికట్టాలని.. రాబోయే కాలంలో మిగులు రాష్ట్రంగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు రెవెన్యూ ఖర్చు తగ్గించి మూలధన వ్యయం పెంచాలన్నారు.