TG: ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామికి హైకోర్టులో చుక్కెదురైంది. వారం రోజుల్లో అతనిపై చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్కు స్పష్టం చేసింది. నాగచైతన్య-శోభిత ఎప్పుడు విడాకులు తీసుకుంటారనే విషయంపై వేణు స్వామి జోతిష్యం చెప్పారు. దీనిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోషియేషన్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయగా.. తమ ముందు హాజరు కావాలని వేణుస్వామిని ఆదేశించింది. దీంతో అతను కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే.