TG: గురుకుల, హాస్టల్ విద్యార్థులకు దీపావళి కానుకగా ప్రభుత్వం హాస్టళ్లలో డైట్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచింది. 3-7వ తరగతి వరకు రూ.950 నుంచి రూ.1330, 8-10వ తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1540, ఇంటర్ టు పీజీ వరకు రూ.1500 నుంచి రూ.2100 పెంపు చేసింది. దీంతో 7.65 లక్షల మంది విద్యార్థులు లబ్దిపొందనున్నారు. కాస్మొటిక్ ఛార్జీలు రూ.175 నుంచి రూ.275 వరకు పెంచింది.