TG: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘మూడేళ్ల ముందు మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి.. ఇప్పుడు మాట్లాడినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. నాపై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ ఖాతాల నిర్వాహకులపై పరువు నష్టం దావా వేస్తా’’ అని హెచ్చరించారు.