AP: విజయవాడ వదర బాధితులకు బీమా చెల్లింపులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సంబంధిత అధికారులతో రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీపావళిలోగా బీమా క్లెయిమ్స్ పరిష్కరించాలని సిసోడియా ఏజెన్సీలను కోరారు. అనంతరం పరిహారం చెల్లింపు, బీమా క్లెయిమ్స్‌పై ఆయన సీఎంకు వివరించారు.