తూర్పు లద్దాఖ్‌లోని రెండు ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో గత నాలుగేళ్ల నుంచి చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఈ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా లద్దాఖ్ సెక్టార్‌లోని డెమ్చోక్, డెస్పాంగ్ ప్రాంతాల నుంచి రెండు దేశాల బలగాల ఉపసంహరణ మొదలైనట్లు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు.