కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. రేపు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో వయనాడ్‌లో పెద్ద ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీతో పాటు సోనియా, రాహుల్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పాల్గొననున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కల్పేట బస్టాండ్ నుంచి రోడ్‌షో నిర్వహించనున్నట్లు సమాచారం.