AP: రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, కాకినాడ, రాజమండ్రి, పిఠాపురం, ప్రత్తిపాడు, తునిలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షంతో ఆక్వా రైతులు ఆందోళనలో ఉన్నారు. విజయవాడలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.