ఉత్తరప్రదేశ్లో మదర్సాల చట్టాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివల్, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గతంలో ములాయం సింగ్ హయాంలో ఈ చట్టానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా, మదర్సాల చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు కు చెందిన లక్నో బెంచ్ పేర్కొంది.