TG: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. నందినగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మరణించింది. మరో 20 మంది అస్వస్థతకు గురి కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.