మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర CY. CM దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో BJP ఒంటరిగా గెలవలేదు. కానీ, అధిక సంఖ్యలో సీట్లు, ఓటింగ్ శాతం గెలుచుకుంటుంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా BJP అవతరిస్తుంది. 3 పార్టీలు సాధించే ఓట్లతో రాష్ట్రంలో తప్పకుండా విజయం సాధిస్తాం’ అని ఫడ్నవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా 288 స్థానాలకు గానూ 121 మంది అభ్యర్థులను ప్రకటించింది.