TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి బీసీ కులగణన సర్వే చేపట్టేందుకు వెనుకబడిన తరగతుల కమిషన్ సిద్ధమైంది. ఈ సర్వే మూడు దశల్లో ఎనిమిది వారాల్లో పూర్తి కానుంది. మొదటి దశలో సుమారు 1.2 కోట్ల కుటుంబాల జాబితాపై దృష్టి సారిస్తుంది. రెండో దశలో ఎన్యుమరేటర్లు గృహాల నుంచి డేటాను సేకరిస్తారు. మూడో దశలో.. ప్రభుత్వానికి సమర్పించే ముందు సేకరించిన డేటా ప్రాసెస్ చేయనున్నట్లు సమాచారం.