వాస్తవాధీన రేఖ వెంబడి ఇటీవల కుదిరిన గస్తీ ఒప్పందంపై విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. పుణె యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గస్తీ ఒప్పందం కుదిరినప్పటికీ భారత్-చైనాల మధ్య విశ్వాసాన్ని పునర్నించడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అనూహ్య పరిస్థితుల్లో మన మిలటరీ వాస్తవాధీన రేఖవెంబడి పని చేసిందని కితాబు పలికారు.