TG: ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్‌ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి పొంగులేటికి మొక్కను బహుకరించి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని మంత్రి అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు పొంగులేటికి విష్ చేశారు. మంత్రి పుట్టినరోజుని పురస్కరించుకుని అన్నదానం, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఆసుపత్రుల్లోని రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.