TG: సూర్యాపేట జిల్లాకేంద్రంలోని 20వార్డు (జమ్మిగడ్డ)లో నెల రోజులలో 6 మంది వివిధ కారణాలతో మృతిచెందారు. వీరంతా మంగళవారం రోజే చనిపోవడంతో కాలనీవాసులు.. వార్డుకు కీడు సోకిందని వార్డు ప్రజలంతా ఇంటికి తాళం వేసి ఒకరోజు వనవాసానికి వెళ్లి అక్కడే భోజనాలు చేసి రావాలన్నారు. వార్డులో 350 కుటుంబాలకు పైగా సభ్యులు ఉదయం 10.30 గంటలకు ఇళ్లకు తాళం వేసి శివారులోని దురాజ్‌పల్లి గుట్టకు వన వాసానికి వెళ్లారు.