ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో రూ.986.7 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్లు ప్రకటించింది. ఇక కంపెనీ కార్యకలాపాల ఆదాయం 14.6 శాతం వృద్ధి చెంది రూ.17800 కోట్లకు చేరుకుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంధన ఖర్చులు పెరగడం, కొన్ని విమానాలను నిలిపివేయడం వల్ల నష్టాలపై ప్రభావం చూపాయన్నారు.