TG: తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో లడ్డూ ప్రసాదం చెకింగ్ జరుగుతోంది. లడ్డూ క్వాలిటీ, క్వాంటిటీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో సోదాలు చేపట్టారు. లడ్డు తయారీ కేంద్రంలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపించారు. రిపోర్టుల ఆధారంగా చర్యలుంటాయని అధికారులు తెలిపారు.