ఫామ్ లేమితో జట్టుకు దూరం అయిన పుజారా భారత జట్టులో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరుపున ఆడుతున్న పుజారా(234) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇటీవల NZతో జరిగిన టెస్ట్‌లో భారత్ కేవలం 46 పరుగులకు ఆలౌట్ కావడంతో పుజారా లాంటి ఆటగాడి అవసరం జట్టుకు ఉందని మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో పుజారాను సెలెక్ట్ చేస్తారా? లేదా? అని ఆసక్తిగా మారింది.