మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 22 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు సిట్టింగ్ MLAలు ఉన్నారు. ప్రకాష్ భర్సకలే అకోట్, దేవయాని ఫరాండే నాసిక్ సెంట్రల్, కుమార్ అయాలానీ ఉల్లాస్‌నగర్, రవీంద్ర పాటిల్ పెన్, భీంరావ్ తాప్కిర్ ఖడక్ వాస్లా, సునీల్ కాంబ్లే పుణె కంటోన్మెంట్, సమాధాన్ ఔతాడే పంధర్ పూర్‌కు చోటుదక్కింది. కాగా, తొలి జాబితాలో 99 మంది పేర్లు ప్రకటించారు.