TG: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శల వర్షం కురిపించారు. అమరవీరుల కుటుంబాల సంఖ్యను బీఆర్ఎస్ క్రమంగా తగ్గించిందన్నారు. వారి కుటుంబాలను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎమయ్యాయన్నారు. అధికారం పోయిన తరువాత కేసీఆర్ ఇంటికే పరిమితం కాలేదా అని నిలదీశారు. తామంతా నిత్యం ప్రజల్లో ఉంటున్నామని, బీఆర్ఎస్ ఉనికి కోల్పోతున్న ఉప ప్రాంతీయ పార్టీ అని వెల్లడించారు.