TG: బాపూఘాట్లో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా బాపూఘాట్ అభివృద్ధితో ముందడుగు వేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. పాట్నాలో 72 అడుగుల గాంధీ విగ్రహంతో పాటు అసెంబ్లీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహ డిజైన్ పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ధ్యాన మందిరంతో పాటు వాక్ వే, గార్డెన్స్ అభివృద్ధిపై దృష్టి సారించింది.