TG: ప్రమాదంలో మత్స్యకారుల జీవనం ఉందని మాజీ మంత్రి KTR తెలిపారు. వృత్తి కులాలపై కత్తి కట్టినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నిన్నటి నీలి విప్లవాన్ని నీరుగార్చేస్తున్నారని ఆగ్రహించారు. చేపలు వేటనే నమ్ముకున్న బహుజన కులాల బతుకు దెరువును దెబ్బకొట్టడం న్యాయమా..? అని ఆగ్రహించారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయాలనే రాజకీయ కక్షతో మత్స్యకారుల జీవనోపాధిని కాలరాస్తారా..? అని ఆగ్రహించారు.